యాచారం: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. యాచారం మండలం నందివనపర్తికి చెందిన కొండూరి వెంకటయ్య (65), విజయలక్ష్మి దంపతులు నగరంలో నివాసం ఉంటున్న తమ సమీప బంధువులు సముద్రాల కృష్ణ, సముద్రాల పద్మ, గౌరిశేట్టి రజిత(59), డ్రైవర్ జానయ్యలతో కలసి ఐదురోజుల క్రితం కారులో తీర్థయాత్రలకు బయలుదేరారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథస్వామిని దర్శించుకున్నారు. తిరుగు పయనంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో గౌరిశెట్టి రజిత అక్కడికక్కడే మృతి చెందగా..వెంకటయ్య సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. మిగిలిన వారిని అక్కడి పోలీసులు శ్రీకాకుళం ఆస్పత్రిలో చేర్పించారు. నందివనపర్తి గ్రామానికి చెందిన కొండూరి వెంకటయ్య మంచి వ్యాపారస్తుడుగా గుర్తింపు పొందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి, మరో నలుగురికి గాయాలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన
మృతులు యాచారం వాసులు
Comments
Please login to add a commentAdd a comment