మల్కీజ్‌గూడలో రెండో రోజు విచారణ
యాచారం: మల్కీజ్‌గూడ గ్రామంలోని డ్వాక్రా సంఘాల్లో నిధుల అవకతవకలపై మంగళవారం రెండో రోజు విచారణ కొనసాగింది. యాచారం ఎస్‌బీఐ మేనేజర్ జాన్సీ, సెర్ప్ ఏపీఎం సుదర్శన్‌రెడ్డిలతో పాటు బ్యాంకు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు. ఏడాది కాలంగా విలేజ్ బుక్ కీపర్ వరికుప్పల రాణి ఏఏ సంఘాలకు ఎన్ని రుణాలు ఇప్పించింది? రికవరీ ఎలా ఉంది?రుణాలు పొందిన మహిళలు మల్కీజ్‌గూడ గ్రామానికి చెందిన వారేనా..? తీసుకున్న రుణాలు ప్రతీ నెల వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నారా అనే విషయాలపై రికార్డులను తనిఖీలు చేశారు. రెండో రోజు విచారణకు వీబీకే వరికుప్పల రాణి హాజరైంది. గ్రామంలోని 45 సంఘాల రికార్డులను మహిళా సంఘాల సభ్యుల సమక్షంలోనే పరిశీలించనున్నట్లు సెర్ప్ ఏపీఎం సుదర్శన్‌రెడ్డి తెలిపారు. దుర్వినియోగమైన ప్రతీ పైసా రికవరీ చేస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment