చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: చిన్నారుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచన పెంచే దిశగా పని చేయాలని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అభిప్రాయపడ్డారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం తెలంగాణ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుద్దాల అశోక్‌తేజ రాసిన ఘల్లుఘల్లు అనే పాటను ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. విష సంస్కృతి, సామ్రాజ్యవాద వినిమయ విలువల నేపథ్యంలో మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయని అన్నారు. కులమత, మూఢత్వం పేరుతో దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. చిన్నారుల ఆలోచనలను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి మాట్లాడుతూ.. బాలల్ని అభ్యుదయం దిశగా ప్రోత్సహించాలని అన్నారు. బాలోత్సవం కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వందలాది మంది పాఠశాల విద్యార్థులతో వేలాది మంది బాలబాలికలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల్లో సైంటిపిక్ టెంపర్, సరికొత్త ఆలోచనల్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, బాలోత్సవ కమిటీ బాధ్యుడు బుచ్చిరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రమేష్, భాస్కర్, భూదేవి, శ్రీకాంత్, యశోకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
Comments
Please login to add a commentAdd a comment