చేవెళ్ల: ప్రభుత్వానికి నిత్యం ఆదాయవనరుగా పనిచేసే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం లేక అద్దె భవనంలో కాలం వెళ్ల దీస్తున్నారు. మండలకేంద్రంలో ఏళ్ల తరబడిగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ప్రభుత్వం స్థలం కేటాయించినా నిధులు మంజూరు చేయకపోవడంతో సొంత భవనం కరువైంది. ప్రస్తుతం రోజుకు నాలుగు నుంచి పది రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిందని సిబ్బంది చెబుతున్నారు. చేవెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాలు వస్తాయి. వారానికి ఈ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల ఆదాయం సమకూరుతోంది. సొంత భవనం ఉంటే అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అద్దె భవనంలో ఎన్ని ఏర్పాట్లు చేసినా అవి తాత్కాలికమేనని అంటున్నారు.
నిధులు వస్తే సొంత భవనం
చేవెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు జరిగింది. స్థలాన్ని పరిశీలించాం. త్వరలోనే నిధుల కేటాయింపుతో సొంత భవనం ఏర్పాటవుతుంది. అద్దె భవనం అయినప్పటికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గింది.
– వెంకటరమణ, సబ్‌రిజిస్ట్రార్, చేవెళ్ల
Comments
Please login to add a commentAdd a comment