విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టవేరా
షాద్‌నగర్‌రూరల్: విద్యుత్ స్తంభాన్ని టవేరా వా హనం ఢీకొనడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలో రాయికల్ సమీపంలోని టోల్‌ప్లాజావద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..పట్టణానికి చెందిన విశ్వనాథ్‌శెట్టి ట్యాక్సీ వాహనం(టవేరా) నడిపిస్తు కుటుంబంతో నివసిస్తున్నాడు. విశ్వనాథ్‌శెట్టి తన టవేరా వాహనాన్ని నడుపుకుంటూ జడ్చర్లపైవునుంచి షాద్‌నగర్‌వైపు వస్తున్నక్రమంలో రాయికల్ సమీపంలోని టోల్‌ప్లాజావద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ విశ్వనాథ్‌శెట్టి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రవీందర్‌నాయక్ సిబ్బంది ఎల్లాగౌడ్, మురళీ, దీపక్, సంతోష్, నర్సింగ్‌రాథోడ్‌లు ఘటనా స్థలానికి వెళ్లారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ట్రాఫిక్ పోలీస్ వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మానవత్వంతో సకాలంలో స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ట్రాఫిక్ పోలీసులకు పట్టణ వాసులు అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
డ్రైవర్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment