విద్యుత్ వైర్లు తాకి వరిగడ్డి దగ్ధం
మొయినాబాద్: విద్యుత్ వైర్లు తాకి వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. డీసీఎం వ్యాన్ పాక్షికంగా దగ్ధమైంది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట నుంచి డీసీఎం వరిగడ్డి లోడుతో బయలుదేరింది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటల సమయంలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ సమీపంలోని శ్రీనిధి స్కూల్ వద్దకు చేరుకోగానే విద్యుత్ వైర్లు వరిగడ్డికి తాకి మంటలు అంటుకున్నాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో డీసీఎంను ఆపేసి డ్రైవరు కిందికి దిగాడు. దీన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే వరిగడ్డి పూర్తిగా, డీసీఎం పాక్షికంగా కాలిపోయాయి.
పాక్షికంగా డీసీఎం వ్యాన్..
Comments
Please login to add a commentAdd a comment