వైన్స్‌లో చోరీ
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలో బైపాస్ రోడ్డులోని లక్కీ వైన్స్‌లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వైన్స్ యజమాని కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్స్ దుకాణాన్ని రోజుమాదిరిగా మూసివేసి వెళ్లారన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వైన్ షాపు వెనక నుంచి తలుపులు గడ్డపారతో పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారన్నారు. అక్కడ కౌంటర్‌లోని రూ .5వేలతో పాటు సుమారు రూ. 20వేల విలువ గల మద్యం బాటిళ్లు, సీసీ కెమెరాల హార్డు డిస్కును కూడా దొంగిలించినట్లు ఆయన వివరించారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కృష్ణ పేర్కొన్నారు.
రూ. 5వేలు, 20వేల విలువగల మద్యం బాటిళ్లు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment