యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌నగర్‌కు చెందిన దేవర మాధవి, లక్ష్మయ్య దంపతుల కుమార్తె మౌనిక (19) ఇంటర్ వరకు విద్యనభ్యసించి ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 12న ఉదయం వారు డ్యూటీకి వెళ్లిన సమయంలో కుమారుడు, కుమార్తె ఇంటి వద్దే ఉన్నారు. రాత్రి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. పక్కింటికి వెళ్లొస్థానని చెప్పిందని కుమారుడు సమాధానమిచ్చారు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు జక్కుల హేమంత్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment