విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి
ఆమనగల్లు: బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సీఎల్ శ్రీనివాస్‌యాదవ్ తండ్రి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు చీపురు జంగయ్యయాదవ్ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు జంగయ్యయాదవ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వియ్యంకుడు కావడంతో ఆయన పాడె మోశాడు. అంతకుముందు జంగయ్యయాదవ్ భౌతిక కాయం వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ యాట నర్సింహా, మాజీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు నిర్మల శ్రీశైలం, రవీందర్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీలు పత్యానాయక్, దశరథ్‌నాయక్, పీసీసీ కార్యదర్శి మోహన్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. మృతుని కుమారులు శ్రీనివాస్‌యాదవ్, రవియాదవ్, శేఖర్‌యాదవ్, కూతురు మాధవి, భార్య లక్ష్మీదేవమ్మలను పలువురు పరామర్శించారు. అంత్యక్రియలు తలకొండపల్లి మండలం వెల్జాల్‌గ్రామంలో మంగళవారం నిర్వహించారు.
పలువురి నివాళులు
Comments
Please login to add a commentAdd a comment