ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే చర్యలు
ట్రాఫిక్ సీఐ వెంకటేశం
చేవెళ్ల: ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ట్రా ఫిక్ సీఐ ఎస్.వెంకటేశం హెచ్చరించారు. గురువా రం ఆయన తన సిబ్బందితో కలిసి మండల కేంద్ర ంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి శంకర్‌పల్లి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఆక్రమించిన వ్యపారుల దుకాణాలను తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. పలుమార్లు హెచ్చరించినా వ్యాపారాలు కొనసాగిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నారన్నారు. టాఫిక్ రూల్స్ ప్రకారం ఫుట్‌పాత్‌లపై ఎలాంటి వ్యాపారాలు చేపట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా రు. సీఐ వెంట ఏఎస్‌ఐలు ఎం.అశోక్, చందర్‌నాయక్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment