అతివేగంతో ప్రమాదం
డివైడర్ మధ్యలో స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్‌కు గాయాలు
మొయినాబాద్: టిప్పర్‌ను ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్ చేస్తున్న కారు డివైడర్ మధ్యలో స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన గురువారం హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై గండిపేట చౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి మెయినాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ టిప్పర్‌ను ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేశాడు. అదే వేగంతో ముందుకెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై ఉన్న వీధిదీపాల స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో స్తంభం కారుపై కూలడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment