తాండూరు కందులకు డిమాండ్
తాండూరు: తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో కంది ఉత్పత్తుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన బిడ్డింగ్‌లో 1,341 క్వింటాళ్ల కందులకు విక్రయాలు జరిగాయి. క్వింటాలు కందులకు కనిష్ట ధర రూ.7,550, గరిష్ట ధర రూ.8,631, సగటు ధర రూ. 8,505 చొప్పున పలికాయి. గత నెల రెండో వారం నుంచి ఖరీఫ్‌లో సాగు చేసిన కంది పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తరలి వస్తున్నాయి. మరోవైపు వరి ధాన్యం(సోన రకం) క్వింటాలుకు కనిష్ట ధర రూ.2,385, గరిష్ట ధర రూ.2,565, సగటు ధర రూ.రూ.2,502 చొప్పున పలికాయి. సోయా క్వింటాలుకు రూ.3,321 చొప్పున పలికాయి. దొడ్డు రకం వరి క్వింటాలుకు 2,295 చొప్పున పలికాయి. తాండూరు కందులకు మార్కెట్‌లో డిమాండ్ పలుకుతోంది. ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా కందులకు ధర లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment