కళ్లకు గంతలు కట్టుకొని నిరసన
ఇబ్రహీంపట్నం రూరల్: సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు కళ్లకు గంత లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఓరుగంటి యాదయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు అజీజ్, కార్యదర్శి సంపత్, కోశాధికారి సాయికుమార్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
14వ రోజుకు చేరిన సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్షలు
Comments
Please login to add a commentAdd a comment