క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ స్టేట్ ఆఫీసర్ భీమయ్య అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న 10వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా భీమయ్య మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో విశ్వాసాన్ని, నాయకత్వ పటిమను, దృఢసంకల్పాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతిఒక్కరూ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి తమకు ఇష్టమైన క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. జోనల్ ఆఫీసర్ ప్లారెన్స్‌రాణి మాట్లాడుతూ.. నిత్యం క్రీడల సాధనతో శారీరక దృఢత్వం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కమ్మదనం ప్రిన్సిపాల్ విద్యుల్లత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్‌రాంరెడ్డి, పీడీలు, పీఈటీలు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ స్టేట్ ఆఫీసర్ భీమయ్య
Comments
Please login to add a commentAdd a comment