మొయినాబాద్‌రూరల్: ప్రభుత్వ భూముల జోలికి వస్తే చర్యలు తప్పవని మండల రెవెన్యూ అధికారి గౌతమ్‌కుమార్ హెచ్చరించారు. తోల్‌కట్ట రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 108లోని ఐదెకరాల ప్రభుత్వ భూమిలో కొందరు రాత్రికిరాత్రే ప్రీకాస్ట్ ప్రహరీలు, గదులు నిర్మించారని గ్రామస్తులు తెలపడంతో మంగళవారం ఉదయం రెవెన్యూ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ సందర్భంగా గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఇలాగే కూల్చివేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment