తాళం వేసిన ఇళ్లే టార్గెట్
షాద్‌నగర్ రూరల్: పగటిపూట రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లకు కన్నం వేస్తున్న నిందితుడిని షాద్‌నగర్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ విజయ్‌కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శరత్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 23న ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లాడు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చే వరకు తాళం పగులకొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీరువాలోని 18.1 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లితండాకు చెందిన శివప్రసాద్(25)గా గుర్తించారు. పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకొన్నాడు. నిందితుడి వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. కేసు ఛేదించిన సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించారు.
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
15 తులాల బంగారు ఆభరణాలు రికవరీ
Comments
Please login to add a commentAdd a comment