నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
ముఠాలోని ముగ్గురికి రిమాండ్
హయత్‌నగర్: నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన ముడావత్ దీప్లానాయక్, నందనవనం కాలనీకి చెందిన కేతావత్ పూల్‌సింగ్, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మాచగోని రంగయ్య, బిరాదర్ మారతి, స్వామినాయక్, రమేష్‌నాయక్‌తో పాటు మరికొందరు ముఠాగా ఏర్పడ్డారు. చాలా కాలం ఖాళీగా ఉన్న, అభివృద్ధి చేయని ఇతరుల ప్లాట్లను గుర్తించి.. వాటికి సీసీ కాపీలు సంపాదించారు. వీటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమాయకులకు అంటగడుతున్నారు. వీరి వద్ద ప్లాటు కొనుగోలు చేసిన వాణిశ్యాంప్రసాద్ దంపతులు వీరి మోసాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచారణలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధి గండిచెర్వులోని సర్వే నంబర్ 183, 186–189లోని పలు ప్లాట్లను.. పెద్ద సంస్థలకు సైతం విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు దీప్లానాయక్, పూల్‌సింగ్, రంగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.
విద్యుదాఘాతంతో
డ్రైవర్‌కు గాయాలు
మైలార్‌దేవ్‌పల్లి: విద్యుదాఘాతానికి గురైన ఓ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి ఏఎస్సై స్వరాజ్యం తెలిపిన వివరాల ప్రకారం... జలాల్ బాబానగర్‌కు చెందిన సయ్యద్ మొహ్మద్ ఆలీ(27) కామారెడ్డిలోని తులసీ ఇండస్ట్రీలో డీసీఎం డ్రైవర్. కాటేదాన్ పారిశ్రామికవాడ నుంచి సరుకులు సరఫరా చేస్తుంటారు. మంగళవారం సరుకు నింపుకునేందుకు కాటేదాన్ బుద్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీరామ్‌నగర్ పరిశ్రమకు వెళ్తూ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద డీసీఎంను నిలిపాడు. అతి దగ్గరగా నిలిపి ఉంచడంతో డీసీఎంకు విద్యుత్ షాక్ తగిలింది. కిందికి దిగుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌ఘాతానికి గురై ఎగిరిపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment