ఇబ్రహీంపట్నం రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ కమిటీ సంఘీభావం తెలిపింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, జిల్లా అధ్యక్షుడు కేశవులు, ప్రధాన కార్యదర్శి సత్తారి రాజి రెడ్డి మాట్లాడారు. 18 ఏళ్ల నుంచి పాఠశాల విద్యాభివృద్ధి కోసం ఉన్నత విద్యార్హతలతో పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటానికి మద్దతిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అదృష్టరావు, కరుణాకర్‌రెడ్డి, పట్నం కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment