హయత్‌నగర్ కోర్టులో ఈ సేవ
అబ్దుల్లాపూర్‌మెట్: భవిష్యత్‌లో కేసులు ఈ ఫైలింగ్ చేయాల్సి ఉంటుందని.. అందుకు ఈ సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలని హయత్‌నగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ అధ్యక్షుడు బొడ్డు భిక్షపతిగౌడ్ అన్నారు. మంగళవారం హయత్‌నగర్ కోర్టులో ఏర్పాటు చేసిన ఈ సేవ కేంద్రాన్ని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే వర్చ్యువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇన్‌చార్జి జడ్జి శ్రద్ధ సహిగల్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సంతోశ్‌కుమార్ గౌడ్, ట్రెజరర్ ఈశ్వర్ గౌడ్, మహిళా విభాగం కార్యదర్శి సరితారెడ్డి, క్రీడా కార్యదర్శి శివకుమార్, కార్యవర్గసభ్యులు నాగిరెడ్డి, రామ్మోహన్, సత్యనారాయణ, సైదిరెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు నాజర్ లక్ష్మీనర్సింహారెడ్డి, కోర్టు సూపరింటెండెంట్ శారద, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వర్చ్యువల్‌గా ప్రారంభించిన హైకోర్టు జడ్జి అలోక్ ఆరాధే
Comments
Please login to add a commentAdd a comment