మొగిలిగిద్ద వేడుకలకు సీఎం
షాద్‌నగర్: ఫరూక్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపతున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. స్కూల్ ఏర్పడి 150 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 31న నిర్వహించే వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి స్కూల్ ఆవరణలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆర్‌డీఓ ఆధ్వర్యంలో అధికారుల బృందం గ్రామంలో పర్యటించి అన్ని వివరాలను సేకరిస్తుందన్నారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ తదితర వసతుల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ఆరోగ్య సబ్ సెంటర్, నీటి వసతి ఏర్పాటుకు చర్యలు చేపడుతామని వెల్లడించారు. ఇన్‌చార్జ్ హెచ్‌ఎంతో కొనసాగుతున్న మొగిలిగిద్ద స్కూల్‌కు వెంటనే శాశ్వత హెచ్‌ఎంను నియమించాలని డీఈఓ సుశీందర్‌రావును ఆదేశించారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెంటనే అటెండర్‌ను నియమించాలన్నారు. గ్రామంలో, పాఠశాలలో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాల, గ్రామానికి సేవ చేయడంలో ఎంతో సంతృప్తి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. మొగిలిగిద్దకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. గతంలో ఈ పాఠశాలను సందర్శించినప్పుడు సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీపీఓ సురేష్ మోహన్, ఆర్డీఓ సరిత, నాయకులు పాల్గొన్నారు.
150 వసంతాలు పూర్తి చేసుకున్న పాఠశాల
ఈనెల 31న ఉత్సవాలు
ఏర్పాట్లపై కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష
పకడ్బందీగా సర్వే చేయండి..
నందిగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుభరోసా పథకం సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నందిగామ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ రాజేశ్వర్‌ను అడిగి సర్వే వివరాలను తెలుసుకున్నారు. అనర్హులకు పథకం వర్తించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెంచర్లు, రోడ్లు, కన్వర్షన్ అయిన భూములు, పరిశ్రమలు, గుట్టలు, వాగులు, వంపులను గుర్తించాలన్నారు. కలెక్టర్ వెంట షాద్‌నగర్ ఆర్డీఓ సరిత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment