ఎన్నికల వరకే రాజకీయాలు
శంకర్‌పల్లి: ‘ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అంతా ప్రజల కోసమే పని చేయాలి’ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శంకర్‌పల్లి పట్టణంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద రూ.32.47 కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 (మంచినీటి సరఫరా అభివృద్ధి) పథకానికి గురువారం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కావాల్సిన అన్ని నిధులను కేంద్రం మంజూరు చేస్తోందన్నారు. శంకర్‌పల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు పొడిగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుందన్నారు. రూ.30 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆతర్వాత అంతా ప్రజల కోసమే పనిచేయాలి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
శంకర్‌పల్లిలో 32.47 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment