వైభవంగా జేపీదర్గా గంధోత్సవం
కొత్తూరు: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే గంధోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇన్ముల్‌నర్వ గ్రామం హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీలు బాబాకు గంధం సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... జేపీ దర్గాకు దేశ వ్యాప్తంగా ఖ్యాతి ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో బాబా దర్శనం కోసం వస్తారని తెలిపారు. గత ప్రభుత్వాలు దర్గా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దర్గా దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు, వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా బస్టాండ్, తాగునీరు, వసతి, మరుగుదొడ్లతో పాటు పలు వసతులను కల్పించనున్నట్లు వివరించారు. ఉత్సవాల నేపథ్యంలో శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు శివవంకర్‌గౌడ్, హరినాథ్‌రెడ్డి, ఖాజా, ఖాలేద్, సిరాజ్, తస్లీమ్, రషీద్, షౌకత్, కృష్ణ, ఆగీరు రవికుమార్‌గుప్త, శేఖర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న భక్తజనం
బాబాకు గంధం సమర్పించిన ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment