రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో ప్రతిభ
కొందుర్గు: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ ప్రధాన అథ్లెటిక్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో కొందుర్గు మండలం ముట్పూర్ ఉన్నత పాఠశాలకు చెందిన డాక్టర్ సోలపోగుల స్వాములు ప్రతిభ చాటారని ఎంఈఓ గాయత్రి దేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. షాట్‌పుట్, జావలిన్‌త్రోలో బంగారు పతకం, డిస్కస్‌త్రోలో వెండి పతకం సాధించినట్టు చెప్పారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు మార్చి 4 నుంచి 9వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వాములును పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్
అల్వాల్: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ర్యాపిడో డ్రైవర్‌ను నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వరంగల్ జిల్లా, దామర గ్రామానికి చెందిన మంతూరి హరీష్ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 16న అతను నేరేడ్‌మెట్ గీతానగర్ డీమార్ట్ వద్ద స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా డిఫెన్స్ కాలనీ వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చోరీ సొత్తును అతను మనప్పురం గోల్డ్‌లోన్‌లో కుదవ పెట్టినట్లు తెలిపాడు. నిందితుడు ఉపయోగించిన బైక్‌ను సైతం గత నవంబర్‌లో నిజామాబాద్ జిల్లా, గుడితండాలోని ఓ పొలం వద్ద నిలిపి ఉన్న వాహనాన్ని దొంగిలించిట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలరించారు.
Comments
Please login to add a commentAdd a comment