పండుగ సాయన్న విగ్రహావిష్కరణ
మహేశ్వరం: ముదిరాజులు రాజకీయంగా బలపడినప్పుడే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీలం మధు ముదిరాజ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ వీరుడు పండుగ సాయన్న నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించేవాడని, రజాకార్ల అన్యాయాలను ఎదిరించి ప్రతి ఒక్కరికీ అండగా ఉన్నారన్నారు. పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడు అని కొనియాడారు. పండుగ సాయన్న చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మీర్‌పేట మేయర్ దుర్గాదీప్‌లాల్, బడంగ్‌పేట్ మేయర్ చితురింత పారిజాతరెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మీర్‌పేట ముదిరాజ్ సంఘం ప్రతినిధులు ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, తుమ్మల రమేష్, చింతల రాఘవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment