మాలలపై వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలి
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాలల వ్యతిరేక వైఖరిని మానుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. మేదావుల ముసుగులో మాలలపై విషం కుక్కతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మాలలపై అదే పనిగా పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదన్నారు. అంటరానితనం, ఆకలి, పేదరికం, అవమానాలతో అల్లాడుతున్న మాలలను ఉద్దేశపూర్వకంగా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాల జాతి ఐక్యత కోసం అస్తిత్వ పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అంతా కలిసి మెలికి ఉండాలని సూచించారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు రవళి, కార్యదర్శి వికాస్, యువత ప్రధాన కార్యదర్శి బి.మహేశ్, జిల్లా అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షులు యాదగిరి, సురేశ్, సహాయ కార్యదర్శి మాణిక్యం, ప్రచార కార్యదర్శి జగన్, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మాచన్‌పల్లి రామస్వామి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment