సాక్షి, రంగారెడ్డి జిల్లా: రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సెక్షన్ల వారీగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులు చేపట్టింది. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోడ్ రిలీఫ్ (ఎల్సీ)లకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది. గత వేసవి డిమాండ్‌ను, సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. సర్కిళ్ల వారీగా డైరెక్టర్, సీఈ స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించింది. వీరు రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి, డిమాండ్, సరఫరాపై ఆరా తీయడంతో పాటు సాంకేతిక సమస్యలను ముందే గుర్తించి, సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడనున్నారు. ఈ మేరకు సీపీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదివారం నగరంలోని విద్యుత్ లోడ్ పర్యవేక్షణ, నియంత్రణ (ఎల్‌ఎంఆర్‌సీ) విభాగాన్ని సందర్శించారు. ఇది సంస్థ పరిధిలోని సబ్ స్టేషన్ల లోడ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సర్కిళ్ల వారీగా ఏర్పడే అత్యధిక/అత్యల్ప డిమాండ్లను, వినియో గాన్ని రికార్డు చేస్తూ.. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయడంతో పాటు ఏదైనా ప్రాంతంలో అసాధారణ పరిస్థితులు తలెత్తితే.. వెంటనే సమాచారాన్ని సంబంధిత ఇంజినీర్లకు చేరవేస్తుంది.
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
సర్కిళ్లకు ఇన్‌చార్జుల నియామకం
సర్కిళ్ల వారీగా నియమితులైన ఇన్‌చార్జులు
సర్కిల్ ఇన్‌చార్జులు
రాజేంద్రనగర్ ఎన్.నరసింహులు,
డైరెక్టర్, ఆపరేషన్స్
మేడ్చల్ కె.నందకుమార్,
డైరెక్టర్, ప్రాజెక్ట్స్
హబ్సిగూడ సాయిబాబా,
డైరెక్టర్, కమర్షియల్స్
సరూర్‌నగర్ భిక్షపతి, సీఈ,
కమర్షియల్
హైదరాబాద్ సెంట్రల్/వికారాబాద్
పి.ఆనంద్, సీఈ, పీఅండ్‌ఎం
హైదరాబాద్ సౌత్/ సైబర్‌సిటీ
రంగనాథ్ రాయ్, సీఈ ఎనర్జీ ఆడిట్
బంజారాహిల్స్ ప్రభాకర్, సీఈ, ఐపీసీ
సికింద్రాబాద్ నరసింహస్వామి,
సీఈ, మాస్టర్‌ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment