ప్రణాళికాబద్ధంగా చదవాలి
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఓపెన్ స్కూల్స్ స్టేట్ కో ఆర్డినేటర్ మాధవి అన్నారు. పట్టణంలోని జియోన్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న తరగతులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యకు దూరమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకునేందుకు ఓపెన్ స్కూల్స్ గొప్ప అవకాశమని అన్నారు. భవిష్యత్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉద్యోగాలు సాధించడానికి ఓపెన్ స్కూల్స్ ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పరీక్షలు సమీస్తున్న తరుణంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికలను రూపొందించుకొని సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ కేవీ సత్యనారాయణ, పాఠశాల కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్స్ స్టేట్ కో ఆర్డినేటర్ మాధవి
Comments
Please login to add a commentAdd a comment