వాహనాల వేలం.. రూ.55.06 లక్షల ఆదాయం
తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో పరిధిలో పన్నులు చెల్లించని, ఇతర కారణాలతో సీజ్ చేసిన వాహనాలకు ఆదివారం మన్నెగూడలోని ఆర్టీఏ కార్యాలయంలో వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా అధికారి సుభాష్ చందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం, బండ్లగూడ, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం బస్ డిపోల పరిధిలో గడిచిన ఐదేళ్లుగా సీజ్ చేసిన 178 వాహనాలకు వేలం నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా రవాణ శాఖకు రూ. రూ.55.06 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు.
సాగు భూములకే రైతుభరోసా
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
కేశంపేట: రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ భూములకే రైతు భరోసా అందించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు అన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ అధికారుల సమక్షంలో వ్యవసాయ మోగ్యం కాని భూముల సర్వే మండలంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని అల్వాల గ్రామంలో ఆదివారం నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకంలో భూములను గుర్తించడం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయం చేయని భూములను తొలగిస్తామని, తొలగించిన భూముల సర్వే నంబర్లను గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అక్కడ రైతులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు వివరించారు. రైతు భరోసా కోసం పరిశీలించిన భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రాజరాత్నం, తహసీల్దార్ అజాంఅలీ, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏఈఓ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో జంతుశాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టులను బోధించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలని.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే కనీసం 50 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పారు. నెట్, సెట్, పీహెచ్‌డీల్లో ఏదైనా అర్హత సాధించాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 22న హయత్‌నగర్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
ప్రధానోపాధ్యాయురాలిని అభినందించిన కేంద్ర మంత్రి
మొయినాబాద్: మండల పరిధిలోని పెద్దమంగళారంలో ఉన్న సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమతారెడ్డిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనభినందించారు. నగరంలోని శిల్పారామంలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన పలు పాఠశాలలు, కళాశాలల యాజ మాన్యాలు, ప్రధానోపాధ్యాయులను ఆదివారం అబిడ్స్‌లోని స్టాన్లీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. అందులో భాగంగా పెద్దమంగళారం సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమతారెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment