టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్
సంగారెడ్డి ఎడ్యుకేషన్‌ః ప్రతీ పాఠశాలలో బోధనేతర సిబ్బందిని నియమించడంతోపాటు మౌలికవసతులు కల్పించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యయులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక కులగణన కుటుంబ సర్వే కార్యక్రమంలో ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయుల సమస్యలను పరిశీలించి ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న సూచనలను పరిగణించాలన్నారు. కొఠారి కమిషన్ ప్రకారం విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 30% కేటాయించాలని సూచినప్పటికీ ప్రభుత్వాలు 7% మాత్రమే నిధులు కేటాయించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం కనీసం15% కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రవీందర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగారం శ్రీనివాస్, అనుముల రాంచందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment