పాప కిడ్నాప్ కథ సుఖాంతం
సంగారెడ్డి క్రైమ్: అపహరణకు గురైన పాపను పోలీసులు క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు. ఈ ఘటన సంగారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం.. బస్వాపూర్ గ్రామం పుల్కల్ మండలానికి చెందిన ఆకుల ప్రియ తన కుమార్తె ధరణి (2)తో కలిసి మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ప్రియకు కళ్లు సరిగ్గా కనపడకపోవడంతో తన బిడ్డను చీర కొంగుతో కట్టేసుకుంది. మధ్యాహ్నం పాప ఆడుకుటుందని వదిలేయడంతో అదునుగా భావించిన దుండగలు పాపను అపహరించారు. వెంటనే దగ్గరలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా సంగారెడ్డిలోని నూతన బస్టాండ్ వద్ద రాత్రి 9 గంటలకు పాప ఆచూకీ లభించిందని పోలీసులు వెల్లడించారు. ప్రియకు పాపను అప్పగించారు. నిందితుడు కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment