రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: దేశ ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిబింబిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెహ్రూయువక కేంద్రం, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకుడు నంట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల ద్వారా ఎన్నికై న సభ్యులతో కూడిన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగం ఆమోదించుకున్న రోజైన నవంబర్ 26న భారత ప్రభుత్వం 2015 నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వ హిస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీని ప్రిన్సిపాల్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌వైకే కార్య క్రమ అధికారి కిరణ్, మానిటరింగ్ అధికారి బేతి భాస్కర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి ధరిపల్లి నగేశ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్, అధ్యాపకులు సుధాకర్‌రెడ్డి, కనకచంద్రం, అశోక్, వెంకటరమణ, రఘురాజ్, గంగాధర్, రాజ్యలక్ష్మి, రాజశేఖర్, కౌసర్, విజయభాస్కర్, ప్రసాద్, ఫాతిమ, చక్రవర్తి, భేతి శ్రీనివాస్, నవనీత, కొమురయ్య, దాసు, ఖుర్షిద, పాఠశాల హెచ్‌ఎంలు విజయ్‌కుమార్, కుమారస్వామి మల్టీపర్పస్, క్రాంతీ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలో వక్తలు
జూనియర్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment