వైభవంగా మధనానందస్వామి ఆరాధన ఉత్సవాలు
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని రంగంపేటలోని ఆశ్రమంలో మధనానంద స్వామి సరస్వతీ ఆరాధనోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద స్వామి సరస్వతీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆశ్రమంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అంతకుముందు మాధవానంద స్వామి మాట్లాడుతూ.. డిసెంబర్ 1న గురు మధనానంద స్వామి జన్మస్థలి టేక్మాల్‌లో మహారుద్ర యాగం ఉంటుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు సంతోష్‌రావు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రకాష్‌రెడ్డి, రవితేజరెడ్డి, ఆంజనేయులు, సురేశ్ తదితరులు ఉన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
మెదక్‌జోన్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని నవంబర్ 26న రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి విషయాలను గుర్తుకు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి, సీనియర్ నాయకులు వరుగంటి రామ్మోహన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దళితుల్ని విభజించి
పాలించడం మానుకోండి
● మాలమహానాడు రాష్ట్ర
అధ్యక్షుడు సుధాకర్
మనోహరాబాద్(తూప్రాన్): తమ స్వలాభాల కోసం దళితుల్ని విభజించడం బాధకరమని, అగ్రవర్ణ కులాల వాళ్ల మాయలో పడి దళితులం విడిపోవడం ఏంటని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. ఎస్టీ, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంగళవారం మనోహరాబాద్ మండలంలో యాత్ర నిర్వహించారు. లింగారెడ్డిపేట్ వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, మండల మాలమహానాడు ఆధ్వర్యంలో లింగారెడ్డిపేట్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 1న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు తమ స్వార్థాల కోసం దళితులను విడదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మరాటి రాజు, సామల అశోక్, అనిల్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment