అన్ని రంగాల్లో ఖేడ్ అభివృద్ధి
● ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● హంగిర్గా(బి) అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణపై అసంతృప్తి ● బేటీ బచావో, బేటీ పడావో గోడపత్రిక ఆవిష్కరణ
నారాయణఖేడ్: అన్ని రంగాల్లో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. మన ఊరిలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా ఖేడ్ మండలం రూ.2.70 కోట్లతో తుర్కపల్లి నుంచి పోతన్‌పల్లి, పలుగుతండా మీదుగా కడ్పల్‌వరకు తారురోడ్డు, తుర్కపల్లిలో రూ.5 కోట్లతో సీసీరోడ్డు పనులకు, హంగర్గా(కె) నుంచి ఎర్రబొగుడ వరకు రూ.2.40 కోట్లతో రోడ్డు నిర్మాణం, గునుకులకుంట నుంచి బద్దారం వరకు రూ.2.10 కోట్లతో, నిజాంపేట మండలం పోడ్చట్పల్లిలో రూ.1.70 కోట్లతో తారురోడ్లు, నిజాంపేటలో రూ.10లక్షలతో సీసీరోడ్డుకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...భవిష్యత్తులో అన్ని రంగాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అమలు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల ఆకస్మిక తనిఖీ
పలు అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి...మండలంలోని హంగిర్గా(బి) అంగన్‌వాడీ కేంద్రాన్ని, అక్కడి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో అపరిశుభ్ర పరిసరాలు, విద్యార్థుల గైర్హాజరు, గర్భిణులు, బాలింతలకు ముందుగానే పోషకాహారం అందించినట్లుగా రిజిస్టర్‌లో నమోదు చేయడం వంటి అంశాలపట్ల అంగన్‌వాడీ నిర్వాహకురాలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక పాఠశాల భవనంలో ఏకంగా రేషన్ దుకాణం నడపుతుండటంతో దానిని వెంటనే ఖాళీ చేసి స్కూల్‌కు అప్పగించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment