దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ● గురుకుల ఆర్సీవోలు, పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష
సంగారెడ్డి జోన్: దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పురస్కరించుకుని ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘హమారా విధాన్, సంవిధాన్ – హమారా స్వాభిమాన్‘పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కల్టెకర్ క్రాంతి మాట్లాడుతూ...బీఆర్.అంబేడ్కర్ ఆవిష్కరించిన విలువలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అనంతరం మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖ, గురుకులాల ఆర్సీవోలు, పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)నిధులతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో జిల్లాలోని మోడల్ పాఠశాలు, గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. అదనపు గదుల సౌకర్యం ఉన్న పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
సమయపాలన పాటించాలి
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు, సర్వీస్ రూల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయుల కీలకమని, విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ప్రతివారం ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలసి భోజనం చేసే విధంగా పట్టిక రూపొందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మజారాణి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యో గులు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖేలేష్ రెడ్డి, గురుకుల ఆర్సీవోలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment