క్రీడాకారులు పట్టుదలతో పోరాడాలి
● డీఈఓ రాధాకిషన్
మెదక్ కలెక్టరేట్: క్రీడాకారులు ఓటమికి భయపడకుండా పట్టుదల పోరాడి విజయం సాధించాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో అండర్ 14 రాష్ట్రస్థాయి షటిల్, బాడ్మింటన్ క్రీడలను ఆయన ప్రారంభించారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓడిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురి కాకుండా పట్టుదలతో విజయాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ ఉమ్మడి పది జిల్లాల నుంచి 50 మంది బాలురు, 50 మంది బాలికలు, 30 మంది కోచ్, మేనేజర్‌లు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీని వాసరావు, టోర్నమెంట్ ఆర్గనైజర్ వినోద్ కుమార్, పరిశీలకులు హమీద్ ఖాన్, వ్యాయామ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, మధుసూదన్, దేవేందర్ రెడ్డి, శ్యామ్, సుజాత కుమారి, శ్వేతాకుమారి, శిల్ప, రూపేందర్, దేవేందర్, సత్యారావు, కిష్టయ్య, హరీశ్, ప్రభాకర్, మనోహర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment