రాష్ట్ర స్థాయి మల్లకంబ పోటీలకు ఎంపిక
సిద్దిపేటరూరల్: ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్‌జీఎఫ్ మల్లకంబ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాఘవాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు మంజుభార్గవి మంగళవారం తెలిపారు. నారాయణరావుపేట పాఠశాల వేదికగా 25వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా మల్లకంబ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సత్తాచాటి అండర్ 14 విభాగంలో పీ.అవినాష్, పీ.కుమార్, అండర్ 17 విభాగంలో బీ.అజయ్, పీ.శివకుమార్, ఎన్.గోవర్థన్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఎంపికయ్యారు. విద్యార్థులను తీర్చిదిద్దిన పీడీ ఏర్వ అశోక్‌ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
అథ్లెటిక్స్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు
సిద్దిపేట పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆర్‌డీఎఫ్ మాటిండ్ల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరస్పాండెంట్ నర్సింగోజు విష్ణుమూర్తి తెలిపారు. సబ్ జూనియర్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్‌లో అండర్ 12 లాంగ్‌జంప్ విభాగంలో 7 వ తరగతి చదువుతున్న నీలం ఆశ్వద్, అండర్10 300 మీటర్ల విభాగంలో 4వ తరగతికి చెందిన చుక్క శ్రీహన్విలు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్, అసిస్టెంట్ హెడ్‌మాస్టర్ మల్లయ్య, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందిచారు.
Comments
Please login to add a commentAdd a comment