వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
సిద్దిపేటకమాన్: చలి తీవ్రతతో వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వన్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చలి తీవ్రత పెరుగుతుండడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరించాలన్నారు. దూర ప్రయాణాలు చేయకూడదని తెలిపారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలని, బయట ఆహారం తీసుకోకపోవడం మంచిదన్నారు. ప్రజలకు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది అవగహన కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment