రాంగ్రూట్లో ట్రాక్టర్.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కొండపాక(గజ్వేల్): రాంగ్ రూట్లో వెళ్తూ యూటర్న్ అవుతున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుకునూర్‌పల్లిలో వరి ధాన్యాన్ని ట్రాక్టర్లో నింపుకున్న డ్రైవర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోనే రాజీవ్ రహదారి పక్కన ఉన్న పెద్ద కాంటాలో తూకం వేయించారు. అనంతరం రాంగ్ రూట్లో ట్రాక్టర్‌ను తీసుకెళ్తూ రహదారి పై యూటర్న్ అవుతూ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజన్ నుంచి ట్రాలీ విడిపోయి ధాన్యం కుప్పలతో సహా రోడ్డుపై పడిపోయింది. ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినగా క్యాబిన్లో ఇరుక్కొని డైవరు దాస్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి 108 అంబులెన్స్ ద్వారా స్వల్ప గాయాలైన ప్రయాణికులు నీలిమ, అరుణ, విజయ, శిరీషలతో కలిపి అందరినీ గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు అంబులెన్సు సిబ్బంది పేర్కొన్నారు.
డ్రైవర్‌తోపాటు నలుగురికి గాయాలు
కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment