సాక్షి సిద్దిపేట : చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఉదయం 10 గంటల వరకు బయటకు రాకూడదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. తాజా వేడి వేడి ఆహారం తీసుకోవాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. రూమ్ హీటర్స్ వాడాలి. కానీ అతిగా వినియోగించొద్దు. బయటకు వెళ్లే సమయంలో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ ధరించాలి. సిద్దిపేటలో ప్రస్తుతం 75 నుంచి 80 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. ఇది 50 కి తక్కువగా ఉంటే మంచిది. చలి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ గణేశ్ వెనిశెట్టి, జనరల్ ఫిజీషియన్ సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment