టాలెంట్ టెస్ట్‌లతో ప్రతిభ వెలికితీత
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్ట్‌లు ఎంతగానో దోహదపడతాయని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో బయోలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. తెలుగు మీడియంలో జెడ్పీహెచ్‌ఎస్ అంతారం విద్యార్థి జశ్వంత్ ప్రథమ, జెడ్పీహెచ్‌ఎస్ తెల్లాపూర్ విద్యార్థి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో జెడ్పీహెచ్‌ఎస్ మిర్జాపూర్ విద్యార్థి సాదియానౌషిన్, లింగంపల్లిలోని టీజీఆర్‌ఎస్ గురుకుల విద్యార్థి వినయ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈనెల 28వ తేదీన రాష్ట్రస్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్దారెడ్డి, జీవశాస్త్ర జిల్లా ఫోరం అధ్యక్షుడు మురళి, కార్యదర్శి రామకృష్ణ, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment