కోర్టు తీర్పు చారిత్రాత్మకం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని హాస్మి మజీద్ ఆస్తులకు సంబందించి కోర్టు ఇచ్చి న తీర్పు చారిత్రాత్మకమని మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం నారాయణఖేడ్‌లో విలేకర్లతో మైనార్టీ నాయకులు మాట్లాడారు. పట్టణంలోని హాస్మి మజీద్‌కు 500 ఏళ్ల పూర్వం నుంచి 80 ఎకరాల వరకు భూమి ఉందన్నారు. మజీద్ ముత్తవల్లిగా డాక్టర్ ఎస్‌ఏ మాజీద్ కుటుంబ సభ్యులు ఉండగా మజీద్ నిర్వహణ బాధ్యత చేపట్టాల్సి ఉండగా దాయాదులు దశాబ్దాల క్రితం నుంచి భూములు అనుభవిస్తున్నారని అన్నారు. ఎస్‌ఏ మాజీద్ స్థానిక మజీద్ కమిటీ బాధ్యులతో కలిసి ఈ భూములు నిబంధనల ప్రకారం ముత్తావలి కుటుంబంలో పెద్దవారి పర్యవేక్షణలో ఉండాలని సూచిస్తూ వక్ఫ్‌బోర్డు ద్వారా ఉత్తర్వులు ఇప్పించారన్నారు. ఆనంతరం హాస్మి మజీద్‌కు సంబంధించి సర్వే నంబరు114లోని దాదాపు 40 ఎకరాల భూములకు సంబంధించి ఖాజీ తమకు సైతం భూములను అనుభవించే హక్కు ఉంటుందని ప్రయత్నాలు చేశారన్నారు. తాము అప్పట్లో కోర్టును ఆశ్రయించి ఆ ప్రయత్నాలను అడ్డుకొని స్టే తీసుకొచ్చామన్నారు. స్టే ఉన్నప్పటికీ ఇటీవల మళ్లీ వక్ఫ్‌బోర్డు ద్వారా హాస్మి మజీద్ భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు మళ్లీ హాస్మి మజీద్‌కే ఈ భూములు ఉంటాయని, మజీద్ నిర్వాహణ బాధ్యతలు చేపట్టే వారు భూములను అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను మైనార్టీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ రాజుకు అందించారు. కార్యక్రమంలో మోయిద్‌ఖాన్, ముత్తవలి డాక్టర్ ఎస్‌ఏ మాజీద్, మీర్ అంజద్ అలీ, ఖాదర్‌సాబ్, ముంతాజ్, సికిందర్ అలీ, జకిర్యా ఖురేషి, అజీం, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
ఖేడ్ మైనార్టీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment