సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమగ్ర కుటుంబ సర్వే విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించడంతో పాటు అటెండెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓ పరమేశ్వర్, సీపీఓ బాలశౌరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసి 20 రోజులు దాటిందని, ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ అందడంలో జాప్యం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్‌తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు నాజర్ పటేల్, రాష్ట్ర బాధ్యులు కౌన్సిలర్లు లక్ష్మయ్య యాదవ్, సంజీవయ్య, కమ్రొద్దీన్, జిల్లా కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్
Comments
Please login to add a commentAdd a comment