రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
శివ్వంపేట(నర్సాపూర్) : సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో శివ్వంపేట మండల క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 17, 18 తేదీల్లో మెదక్ జరిగిన వివిధ క్రీడా పోటీల్లో శివ్వంపేట మండలం నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బుధవారం ఖో ఖో ఫైనల్ కొల్చారం జట్టుతో తలపడి విజయం సాధించి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ఎంఈఓ బుచ్చనాయక్, పీడీ చంద్రమోహన్ అభినందించారు.
వాలీబాట్ క్రీడలో ధర్మాజీపేట విద్యార్థులు
దుబ్బాకటౌన్: ఈ నెల 17, 18వ తేదీల్లో సిద్దిపేటలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ క్రీడలో దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అభిజ్ఞ, అక్ష య బాలికల విభాగంలో, అభినవ్ బాలుర విభా గంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవా రం పాఠశాల హెచ్‌ఎం సాదత్ ఆలీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
జీవశాస్త్ర ప్రతిభా పరీక్షల్లో..
సిద్దిపేటజోన్: జీవశాస్త్ర ప్రతిభా పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం స్థానిక టీటీసీ భవన్‌లో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో ఇరుకోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థి వేణు ప్రథమ స్థానంలో నిలువగా, మర్పడగ పాఠశాల విద్యార్థి అభివర్ణిక, సంజనలు ద్వితీయ స్థానంలో నిలిచారు. అదే విధంగా తెలుగు మీడియం విభాగంలో చికోడ్ పాఠశాల విద్యార్థి భువన ప్రథమ స్థానంలో నిలువగా, వెల్కటూర్ పాఠశాల విద్యార్థి సంజన ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, పరీక్షల విభాగం కార్యదర్శి శౌకత్ అలీ, సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖో ఖోలో శివ్వంపేట జట్టు ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment