హెడ్ కానిస్టేబుల్‌పై దాడి
– వ్యక్తి రిమాండ్
పుల్‌కల్(అందోల్) : విధులకు ఆటంకం కలిగించి, హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెష్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పుల్‌కల్ ఎస్సై క్రాంతికుమార్ కథనం మేరకు.. పుల్‌కల్ గ్రామానికి చెందిన సంగమేశ్ బస్టాండ్ ప్రాంతంలో న్యూసెన్స్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ 100కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యూసెన్స్ చేస్తున్న వ్యక్తికి నచ్చజెప్పినా వినలేదు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణకు గాయాలయ్యాయి. న్యూసెన్స్ చేసి, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించినందుకు సంగమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఏడుపాయల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా బిలాల్‌పూర్ గ్రామానికి చెందిన బలుపాటి ఆనంద్ (33) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వాడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం ఏడుపాయల దుర్గా భవానీ ఆలయ సమీపంలోని మంజీరా నది ఒడ్డున ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
యువకుడి అదృశ్యం
టేక్మాల్(మెదక్): యువకుడు అదృశ్యమైన ఘటన టేక్మాల్ మండలంలోని కోరంపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేష్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయిని మధు వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో తల్లిగారింటికి వెళ్లిపోయింది. 17న రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో మధు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు బ్లూ కలర్ షర్ట్, జీన్స్ పాయింట్ వేసుకున్నట్లు తెలిపారు. తల్లి బోయిని సంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment