కోడి పిల్లలు.. విలవిల
సంగారెడ్డి జోన్: చలికి తట్టుకోలేక కోడి పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఝరాసంగం మండల పరిధిలోని ప్యారవరం గ్రామంలో సంగమేశ్వర్ తన వద్ద ఉన్న పౌల్ట్రీ షెడ్డులో కోడి పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాడు. షెడ్డు లోపలికి గాలి వెళ్లకుండా బయటి భాగంతో పాటు లోపలి భాగంలో టార్పిన్ కవర్‌ను కట్టాడు. షెడ్డులో 9,000 కోడి పిల్లలు ఉన్నాయి. అందులో 1,000 కోడిపిల్లలను ఒక విభాగంగా 9 విభాగాలను ఏర్పాటు చేశారు. 9 బ్యాలర్ (డబ్డా)లను ఏర్పాటు చేసి కట్టెలు వేసి మంటతో వెచ్చదనం అందిస్తున్నాడు. ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు, అర్థరాత్రి 12 గంటలకు, వేకువ జామున 3 గంటలకు, ఉదయం 6 గంటలకు మంటలను వేస్తూ కాపాడుకుంటున్నాడు. అయినప్పటికీ ప్రతి రోజూ సుమారు 15 నుంచి 20 కోడి పిల్లల మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి తీవ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో పశు సంరక్షణ కోసం కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్యారవరం గ్రామంలో చలికి మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment