మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
డీఆర్‌డీఏ అదనపు పీడీ బాలకృష్ణ
కొండపాక(గజ్వేల్): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తూ తగిన ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని డీఆర్‌డీఏ అదనపు పీడీ బాలకృష్ణ పేర్కొన్నారు. మండల పరిధిలోని దుద్దెడలో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతి లబ్ధిదారులకు టైలరింగ్, డైరీ, ఫార్మ్, వర్మి కంపోస్టు ఎరువుల తయారీ కోసం శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకుల నుంచి రుణ సాయం పొందేలా ప్రోత్సాహకాన్ని అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఐకేసీ ఏపీఓ సర్వర్ పాషా, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, ట్రైనర్ రేణుక, సంస్థ సిబ్బంది నజీమ్, నాగరాజు, స్వప్న, కనకయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment