ట్రాక్టర్‌ను బస్సుఢీకొని ఇద్దరికి
మనోహరాబాద్(తూప్రాన్): ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్‌లో చోటు చేసుకుంది. గురు వారం ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. తూ ప్రాన్ మండలం రావెల్లి గ్రామానికి చెందిన బోల్లబోయిన సత్తయ్య యాదవ్ ట్రాక్టర్‌ను గ్రామానికి చెందిన మల్లేశ్ 17వ తేదీన కిరాయికి తీసుకొని మండల కేంద్రంలోని కాకతీయ పైపు పరిశ్రమ కంపెనీకి వెళ్లాడు. పైపులు తీసుకొని తిరిగొచ్చే క్రమంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ఉన్న కూలీలు మర్కష్ తోఫాలే, బిజిలే శంకర్ జల్చాలుకి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ యజమాని సత్తయ్య యాదవ్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీని ఢీకొట్టిన బైక్..
మనోహరాబాద్(తూప్రాన్): లారీని బైక్ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మనోహరాబాద్ మండలంలోని పాలాట గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహ్మ బైక్‌పై పని నిమిత్తం తూప్రాన్‌కు బయ లు దేరాడు. రామాయపల్లి వద్దకు రాగానే యూట ర్న్ చేస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన నర్సింహ్మను తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
కారు ఢీకొని విద్యార్థికి ..
వెల్దుర్తి(తూప్రాన్) : కారు ఢీకొనడంతో విద్యార్థికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని యశ్వంతరావ్‌పేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యశ్వంతరావ్‌పేట గ్రామానికి చెందిన భ్యాగరి కళావతి, శ్రీనివాస్ కుమారుడు వంశీ(14) మంగళపర్తి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ప్రత్యేక తరగతులు ముగిసిన అనంతరం కాలినడకన స్నేహితులతో కలిసి ఇంటికొచ్చే క్రమంలో బీటీ రోడ్డు దాటుతున్నాడు. నర్సాపూర్ నుంచి వెల్దుర్తి వైపు వస్తున్న కారు అతివేగంతో వచ్చి వంశీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
దుబ్బాకరూరల్: ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజ్ కథనం మేరకు.. వెంకటగిరి తండాకి చెందిన అజ్మీరకమల్ నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. బుధవారం రాత్రి శిలాజీనగర్ గ్రామా నికి చెందిన పెంబర్తి ట్రాక్టర్ డ్రైవర్ రాకేష్(23) ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్‌లో మట్టిని తరలిస్తున్నాడు. వాహనం నడుపుతున్న క్రమంలో ఒక్కసారిగా కిందపడటంతో టైర్లు మీది నుంచి వెళ్లాయి. తీవ్రగాయాలైన అతడిని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment