బతుకుదెరువు కోసం వెళ్లి..
● జార్ఖండ్‌లో అక్కన్నపేట వాసి మృతి ● విధులకు వెళ్తుండగా ఢీకొట్టిన వ్యాన్
అక్కన్నపేట(హుస్నాబాద్): బతుకుదెరువు కోసం జార్ఖండ్ రాష్టానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. అక్కన్నపేట మండలం మసిరెడ్డితండా గ్రామ పంచాయతీ పరిధిలోని ర్యాగటోనిపల్లెకి చెందిన ర్యాగటి సారవ్వ–చంద్రయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడైన ప్రవీణ్(25) బీటెక్ పూర్తి చేసి జార్ఖండ్‌లో హెచ్‌సీఎల్ సూర్థ మైన్స్ మైనింగ్ కంపెనీలో ఫోర్ మెన్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. రోజు మాదిరిగా గురువారం విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్న ప్రవీణ్ మృతి చెందడం పల్లెవాసులకు కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment