సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నర్సాపూర్ రూరల్: సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖో ఖో జట్టుకు నర్సాపూర్ మండలం జక్కపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. గురువారం విద్యార్థులను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్జానా, పీడీ అశోక్ ఇతర అధ్యాపక బృందం అభినందించారు. ఇటీవల మెదక్ ్ల కేంద్రంలో జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి ఖో ఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో విద్యార్థులు దివ్య, ప్రసన్న, ఇందుప్రియ, భవ్య, వర్షిత, శ్రీజ, స్పందన, ప్రణిత, సాహిత, అక్షిత, రమ్య, సుప్రియ ఉన్నారు.
మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ విభాగంలో..
సంగారెడ్డి : సీఎం కప్ క్రీడల్లో భాగంగా అండర్ 19 మిక్స్‌డ్ డబుల్ బ్యాడ్మింటన్ విభాగంలో సగ్గల అక్షయ, ఖలీల్ గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు సంగారెడ్డి జిల్లా తరఫున ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా యువజన క్రీడల అధికారి ఖాసీం బేగ్, సెకట్రరీ జావీద్ అలీ హర్షం వ్యక్తం చేశారు.
అథ్లెటిక్స్ పోటీలకు చేగుంట విద్యార్థులు
చేగుంట(తూప్రాన్): సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ శారద తెలిపారు. ఆమె కథనం మేరకు.. జిల్లా స్థాయిలో 200 మీటర్ల రన్నింగ్ పోటీల్లో గాయత్రీ మొదటి స్థానంలో, 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో అంకిత రెండో స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లుపేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment