ఇంటి నుంచి వెళ్లి మహిళ..
చేగుంట(తూప్రాన్): ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. మండలంలోని బోనాల గ్రామానికి చెందిన పుల్లబోయిన నాగరాణి భర్త మృతి చెందడంతో గ్రామంలోనే పుట్టింట్లో ఉంటుంది. బుధవారం ఇంట్లో వారంతా వ్యవసాయ పనులకు వెళ్లగా నాగరాణి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లి పోయింది. తల్లి శశికళ తెలిసిన వారి వద్ద, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పనికి వెళ్లిన యువతి..
అక్కన్నపేట(హుస్నాబాద్): యువతి అదృశ్యమైన ఘటన అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ భాస్కర్ కథనం మేరు.. అక్కన్నపేట మండలానికి చెందిన ఓ యువతి(21) హుస్నాబాద్ పట్టణంలోని ఓ దుకాణంలో వర్కర్‌గా పని చేస్తుంది. 14వ తేదీన ఇంటి నుంచి ఎప్పటిలాగే హుస్నాబాద్‌కు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment